రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నారు, అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ కు వస్తుందా ఇంకా సమయం పడుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.. ఈకరోనా మహమ్మారి టెన్షన్ పెట్టిస్తోంది చిత్ర యూనిట్ ని.. ఒక్కొక్కరికి కరోనా వస్తూ ఉండటంతో చిత్ర యూనిట్ కూడా కొన్ని రోజులు షూటింగ్ కు బ్రేకు ఇచ్చింది.
సినిమాని ఈ యేడాది జూలై 31న విడుదల చేయనున్నట్టు ముందు ప్రకటించారు. ఆ తర్వాత 2021 జనవరి 8కు పోస్ట్ పోన్ అయింది. ఆ తర్వాత కరోనాతో ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ లేదు, ఇంకా షూటింగ్ చాలా వరకూ ఉంది, ఇక ఈసారి ఎలాగైనా
2021 దసరాకు చిత్రం విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నారట రాజమౌళి.
రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తే.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. ఇక తాజాగా చరణ్ కు కరోనా పాజిటీవ్ వచ్చింది దీంతో ఆయన క్వారంటైన్ లో ఉన్నారు, ఇంట్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు వైద్యుల సలహాతో, ఇక అరవై రోజుల పాటు వరుసగా సినిమా షూటింగ్ చేశారు చిత్ర యూనిట్.. మరో నెల్లో సినిమా షూటింగ్ పూర్తి అవనుంది అని తెలుస్తోంది.