రచ్చ రచ్చ చేశారు మెగాస్టార్ సీరియస్

రచ్చ రచ్చ చేశారు మెగాస్టార్ సీరియస్

0
92

మెగాస్టార్ చిరంజీవి తాజాగా కొరటాల శివతో సినిమా చేస్తున్నారు.. అయితే తాజాగా ఈసినిమా టైటిల్ కూడా మెగాస్టార్ పొరపాటుగా అనౌన్స్ చేసేశారు … దీని కోసం పెద్ద ఫంక్షన్ పెట్టాలని శివ ప్లాన్ చేశారు.. కాని ఓ సినిమా ఫంక్షన్ లో మెగాస్టార్ మొత్తానికి ఆచార్య అనే టైటిల్ అనౌన్స్ చేశారు..

ఇక ఇప్పటికే ఈ సినిమా సెట్స్ పై ఉంది, ఇక ఉగాదికి ఈ టైటిల్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది అనుకున్నారు …కాని దీనిని సోషల్ మీడియాలో విడుదల చేస్తారు అని తెలుస్తోంది, అయితే ఇందులో ఓ కీలక పాత్ర కోసం ముందు కొరటాల చరణ్ తో మాట్లాడారు… కాని ఆయన ఆర్ ఆర్ ఆర్ వర్క్ వల్ల వదులుకున్నారు, తర్వాత బన్నీ పేరు వినిపించింది, ఆయన సుకుమార్ ప్రాజెక్ట వల్ద వదులుకున్నారు.

ఇక తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు పేరు తెరపైకి వచ్చింది… అయితే ఇది మల్టీస్టారర్ చిత్రంగా అయిపోతుంది అని అనుకున్నారు, అయితే ఈ రోల్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది, అయితే ఈ సినిమాలో ఇంతమంది పేర్లు వినిపించడం ఈ పాత్ర గురించి రచ్చ జరగడంతో మెగాస్టార్ ఫైర్ అయ్యారట… ఇలాంటి లీకులు రాకుండా జాగ్రత్త పడాలి అన్నారట, ఇది మెగా స్టార్ సినిమా కాదు సూపర్ స్టార్ సినిమా అనేలా బయట ప్రచారం జరుగుతోంది… కాని ఇందులో ఇంకా ఆపాత్ర కోసం ఎవరిని ఫిక్స్ చేయలేదట.