అంచనాల్ని పెంచేసిన ‘రాధేశ్యామ్’ ఫస్ట్ సింగిల్ సాంగ్

Impressive 'Radheshyam' first single song

0
91

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘రాధేశ్యామ్​’ నుంచి తొలి లిరికల్​ వచ్చేసింది. ‘ఈ రాతలే’ అనే లిరిక్స్​తో ఉన్న ఈ పాట..శ్రోతల్ని అలరిస్తూ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. ఇందులో ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్​గా నటించింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి రానుంది.

ఇవే కాకుండా ప్రభాస్ సలార్, ఆదిపురుష్ సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్. వీటిలో ఆదిపురుష్ షూటింగ్ పూర్తవగా..’సలార్’ చిత్రీకరణ జరుగుతోంది. వీటితో పాటు నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్​లోనూ ప్రభాస్ సినిమాలు చేయాల్సి ఉంది.

ప్రభాస్ సినిమాల అప్డేట్స్ రాకపోవడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చిత్రయూనిట్..దర్శకుడిని తెగ వేడుకున్నారు. అప్డేట్ ఇవ్వాలంటూ నెట్టింట్లో కామెంట్స్ ద్వారా చిన్నపాటి యుద్ధమే చేశారు. దీంతో రాధేశ్యామ్ చిత్రయూనిట్ ఎట్టకేలకు దిగొచ్చి ఫస్ట్ సింగిల్ సాంగ్ విడుదల చేసింది చిత్రయూనిట్.

https://www.youtube.com/watch?time_continue=1&v=vHuBCcm7KC8&feature=emb_title