ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతోన్న రాధే శ్యామ్ చిత్రం కోసం యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. అత్యం భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
ఇందులో భాగంగానే సినిమాను ఎక్కడ కంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాను వచ్చే జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోన్న విషయం తెలిసిందే. దీంతో సినిమా తేదీ దగ్గర పడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్‌ను పెంచే పనిలో పడింది.
ఇక తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెబుతూ చిత్ర యూనిట్ మరో అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. ఈ సినిమాలో సెకండ్ సింగిల్‌ను విడుదల చేసింది. ప్రస్తుతానికి ఈ పాట హిందీ వెర్షన్‌ను విడుదల చేశారు. ‘ఆషీకి ఆగయి’ అని సాగే ఈ పాట ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. ముఖ్యంగా ప్రభాస్, పూజాల మధ్య రొమాన్స్‌కు ఫిదా అవుతున్నారు. ఇక పాటను తెరకెక్కించిన లొకేషన్స్ అద్భుతంగా ఉన్నాయి.
https://www.youtube.com/watch?v=c-NaCU2n8jg