రాహుల్ కు సినిమా ఛాన్స్ డైరెక్టర్ ఎవరంటే

రాహుల్ కు సినిమా ఛాన్స్ డైరెక్టర్ ఎవరంటే

0
107

ప్లేబ్యాక్ సింగర్ గా అందరి మదిలో మంచి ప్లేస్ సంపాదించుకున్న రాహుల్ సిప్లిగంజ్ …బిగ్ బాస్ టైటిల్ 3 విన్నర్ అయ్యాక మంచి స్టార్ డమ్ పొందారు.. దాంతో నాలుగైదు వారాల నుంచి యూట్యూబ్‌ స్టార్‌గా రికార్డుల్లో కొనసాగుతున్నాడు. ఇప్పుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయం అవుతున్నాడు.

అవును రాహుల్ కు సినిమా ఆఫర్ వచ్చింది .ప్రముఖ స్టార్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ రాహుల్ ను తన సినిమాలో కీలక పాత్ర చేయిస్తున్నారు… రంగమార్తాండ సినిమాలో అగ్రనటులు ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందంతో కలిసి నటించే అరుదైన అవకాశం రాహుల్ కు వచ్చింది. దీంతో రాహుల్ చాలా ఆనందంగా ఉన్నాడు.

రాహుల్ కు ఇలా సినిమా అవకాశం రావడంతో పాతబస్తీ వాసులు ఆయన సన్నిహితులు ఆనందంలో ఉన్నారు. ఇలాంటి సీనియర్ నటులతో నటించే అవకాశం తనకు రావడం చాలా ఆనందంగా ఉంది అంటున్నాడు రాహుల్ , ఇది తన సినిమా కెరియర్ కు తొలి మెట్టుగా రాహుల్ భావించి ముందుకు వెళితే కచ్చితంగా సినిమారంగంలో సక్సస్ అవుతాడు అంటున్నారు సీనియర్ నటులు.