రాజకీయనాయకుడిగా బన్నీ – ఫ్యాన్స్ కి పండుగే

రాజకీయనాయకుడిగా బన్నీ - ఫ్యాన్స్ కి పండుగే

0
130

టాలీవుడ్ స్పైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఏడాది అల వైకుంఠపురం చిత్రం ద్వారా సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు, అదే జోరుతో ఇప్పుడు పుష్ప సినిమా చేస్తున్నారు. ఇక వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ అవుతుంది, అయితే తర్వాత బన్నీ ఏ సినిమా చేస్తారు అంటే ఈ లాక్ డౌన్ వేళ అనేక కథలు విన్నారు ఆయన.. అందులో ఏ దర్శకుడికి ఒకే చెబుతారు అనేది మాత్రం తెలియని స్దితి.

అయితే దీని తర్వాత పక్కాగా కొరటాల శివతో సినిమా ఉంటుంది అని అంటున్నారు.. అల్లు అరవింద్ సమర్పణలో యువసుధ బ్యానర్పై మిక్కిలినేని సుదాకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి బన్నీ స్నేహితులు శాండీ, స్వాతి, నట్టి కోలు నిర్మాతలుగా చేయనున్నారు. అయితే వచ్చే ఏడాది మధ్యలో సెట్స్ పైకి వెళ్లి 2022లో వెండితెరపై రానుంది ఈ చిత్రం.

తాజాగా ఈ సినిమాపై అనేక వార్తలు వినిపిస్తున్నాయి, అల్లు అర్జున్ ఈ సినిమాలో రాజకీయ నేతగా కనిపిస్తాడని అంటున్నారు. అయితే ఇంతకుముందు బన్నీ రేసుగుర్రం సినిమాలో ఇలాంటి కథలో నటించారు.. కాని అందులో ఆయన రాజకీయ నాయకుడిగా నటించలేదు. కాని సమాజంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్న పేదలు విద్యార్దులు ఉద్యోగం లేని యువత ఈ కాన్సెప్ట్ కథలో ఆయన నటిస్తారు అని తెలుస్తోంది, కొరటాల శివ ఆచార్య సినిమా తర్వాత ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారు.