మహాభారతం సినిమా పై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

మహాభారతం సినిమా పై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

0
112

మత్తు వదలరా నటులు సింహా, సత్య, అగస్త్యలతో ప్రముఖ దర్శకుడు రాజమౌళి సరదాగా ముచ్చటించారు. ఈ సరదా చిట్ చాట్ లో అనేక విషయాలు పంచుకున్నారు, అయితే దర్శకుడు రాజమౌళిని కూడా చాలా విషయాలు అడిగి తెలుసుకున్నారు, వారి జీవితంలో చోటుచేసుకున్న సరదా సంఘటనలను అడిగి రాజమౌళి తెలుసుకున్నారు.

అదే సమయంలో, రాజమౌళిపై కూడా వారు కొన్ని ప్రశ్నలు వేశారు. అందులో ఒక ఆసక్తికరమైన ప్రశ్నను నటుడు సత్య అడిగాడు.ఇతిహాసం, పంచమవేదం అయిన మహాభారతంలో కనీసం ఒక్క ఎపిసోడ్ అయినా మీరు సినిమాగా తీస్తారన్న వదంతులు వినపడుతున్నాయి ఇది ఎంత వరకూ వాస్తవం అని ప్రశ్నించారు.

దీనిపై రాజమౌళి మాట్లాడుతూ మహాభారతం చేస్తే ఒక ఎపిసోడ్ ఎందుకు చేస్తాం.. ఫుల్ ప్లెడ్జ్ డ్ గానే చేయాలి. చాలాసార్లు చెప్పాను. మ్యాగ్జిమ్ ఇంట్రస్ట్ అని.. చేస్తాను అని అన్నారు. అయితే ఈ సినిమా ఇప్పుడు కాకపోయినా కచ్చితంగా వచ్చే రోజుల్లో మహాభారతం సినిమా చేస్తాను అంటున్నారు రాజమౌళి, ఇది కూడా చరిత్ర కాబట్టి భారీ బడ్జెట్ తో ఉంటుందని, బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ నటులతో ఈ సినిమా ఉంటుంది అని తెలుస్తోంది.