ఆర్ఆర్ఆర్ తారక్ లుక్ పై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

-

ఆర్ఆర్ఆర్ ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చరణ్ రాజమౌళి అభిమానులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు, అంతేకాదు బాహుబలి తర్వాత సెట్స్ పై పెట్టిన రాజమౌళి చిత్రం ఇది, దీంతో చాలా ఆశలు పెట్టుకున్నారు ఈ సినిమాపై.

- Advertisement -

అయితే ముందు నుంచి ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం అవుతూనే ఉంది, ఈ కోవిడ్ లాక్ డౌన్ లో మార్చి నుంచి మళ్లీ షూటింగ్ ఆగిపోయింది, అయితే ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుందో ఇంకా తెలియని స్దితి.ఈ సినిమాలో రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నారు.వారిపై కొన్ని సీన్స్ మాత్రమే చేశారు.

ఇంకా చాలా వరకూ సినిమా తెరకెక్కించాల్సి ఉంది.రామ్ చరణ్ లుక్ ని రివీల్ చేసి ప్రపంచం దృష్టిని తన వైపు తిప్పుకున్నారు, ఇప్పుడు మరి ఎన్టీఆర్ లుక్ ఎప్పుడు అని అందరూ ఎదురుచూస్తున్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ .. ఎన్టీఆర్ లుక్ పై క్లారిటీ ఇచ్చారు.పరిస్థితులు చక్కబడిన వెంటనే షూటింగ్ వెళ్తాం. ఈ విషయంలో వైద్యుల సలహా తప్పకుండా తీసుకుంటాం. అన్నీ సెట్ అయితే పది, పదిహేను రోజుల్లో తారక్ లుక్కు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరించి, ఫస్ట్ లుక్ విడుదల చేస్తాం అన్నారు. దీంతో తారక్ అభిమానులు ఖుషీగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...