ఆర్ఆర్ఆర్ సినిమా టీజర్ కోసం అంతలా అందరూ వెయిట్ చేశారు… టీజర్ వచ్చింది ఎన్టీఆర్ లుక్ బాగుంది అంతా బాగుంది. కాని చివరన ఎన్టీఆర్ లుక్ మాత్రం ఇప్పుడు పెద్దచర్చనీయాంశమైంది, దీనిపై వివాదం రావడంతో జక్కన్న సమాధానం చెప్పాలి అని అందరూ అడుగుతున్నారు.
కొమరం భీమ్ జయంతి సందర్భంగా మొన్న ఎన్టీఆర్ లుక్ని రివీల్ చేస్తూ టీజర్ని రిలీజ్ చేసింది చిత్ర బృందం. .టీజర్లో ఎన్టీఆర్ ముస్లిం గెటప్ ఈ వివాదానికి దారితీసింది. జల్, జంగల్, జమీన్ నినాదంతో నిజాం పాలనపై తిరుగుబావుట ఎగరవేసిన మన్యం వీరుడి క్యారెక్టర్కి అలా టోపీ ఎలా పెడుతారని, ఎవరిపై పోరాటం చేశాడో మీకు తెలియదా అని అందరూ విమర్శలు చేస్తున్నారు.
అయితే జక్కన్నకు ఇది మరింత హీట్ పుట్టిస్తోంది, దర్శకుడు రాజమౌళికి ఎంపీ సోయం బాపు రావు వార్నింగ్ ఇచ్చారు. ఆర్ ఆర్ ఆర్ మూవీలో భీం పాత్రకు పెట్టిన టోపీ తొలగించాలి, ఒకవేళ అలాగే విడుదల చేస్తే థియేటర్లను తగుల బెట్టె అవకాశం ఉందని అయన అన్నారు. నైజాం కు వ్యతిరేకంగా కొమురం భీం పోరాటం చేసి అమరుడయ్యారని, భీం ను చంపిన వాళ్ళ టోపీ ఆయనకు పెట్టడం ఆదివాసులను అవమానించడమేనని అన్నారు. అయితే అసలు ఒరిజినల్ కధ జక్కన్నకు తెలుసా అని సోషల్ మీడియాలో చాలా మంది కామెంట్లు పెడుతున్నారు.