రాజమౌళి-మహేష్ కాంబో..జక్కన్న ప్లాన్ మామూలుగా లేదు..ఏకంగా అవెంజర్ థోర్ కూడా..

0
117

ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్ ల కలయికలో సినిమాలు రాబోతున్నాయి. అందులో మొదటిది రాజమౌళి-మహేష్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఇంకా పట్టాలెక్కని ఈ సినిమాపై రోజుకో న్యూస్ బయటకు వస్తుంది.

ఇక తాజాగా ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్స్ నటిస్తున్నారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. జురాసిక్ పార్క్, స్పైడర్ మ్యాన్, అవెంజర్స్ వంటి చిత్రాల్లో నటించిన శామ్యూల్ ఎల్ జాక్స్ తో పాటు అవెంజర్ థోర్ గా నటించిన క్రిస్ హెమ్స్ కూడా నటించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇకపోతే ఈ సినిమా యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కనుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కపోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి పూర్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.కాగా ఈ సినిమాను కేఎల్ నారాయణ ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు.