మనసులో మాట బయటపెట్టిన జక్కన్న..కమల్ హాసన్, రజిని కాంత్‌లతో రాజమౌళి సినిమా?

Rajamouli movie with Kamal Haasan and Rajini Kant?

0
99

తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి టాప్ మోస్ట్ డైరెక్టర్. ఇప్పటివరకు గెలుపు తప్ప ఓటమి తెలియని దర్శక ధీరుడు. సింహాద్రి, ఛత్రపతి, విక్రమార్కుడు, ఈగ, బాహుబలి, బాహుబలి 2 తో రాజమౌళి పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు. అంతేకాదు మర్యాదరామన్న వంటి చిన్న  సినిమాతో కూడా హిట్ కొట్టగలనని ప్రూవ్ చేసుకున్నాడు.

ఇక ప్రస్తుతం ‘RRR’ వంటి ప్రతిష్టాత్మక సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. తాజాగా రాజమౌళి ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన మనసులో మాటను ఈ సందర్బంగా తెలిపాడు.

ఈ సందర్బంగా రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..అగ్ర హీరోలైన రజినీ, కమల్ లతో కలిసి సినిమా చేయాలని ఉందని..ఐతే దానికి సంబంధించి ఒక మంచి కథను కూడా తయారు చేసుకోవాలని పేర్కొన్నారు. అయితే.. ఈ ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభం కానుందో వేచి చూడాలి మరి.