జనని సాంగ్ రిలీజ్ అంటూ ప్రెస్ మీట్ పెట్టి RRR ఫాన్స్ కు షాకిచ్చిన రాజమౌళి

Rajamouli shocked RRR fans with a press meet on the release of Janani song

0
96

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరక్కేక్కిస్తున్న చిత్రం “RRR”. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లాంటి స్టార్స్ నటించడం ప్రపంచం గర్వించ దర్శకుడు తీస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారంటే అతిశయోక్తి లేదు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక ఇటీవల విడుదలైన నాటు నాటు వీర నాటు సాంగ్ నెట్టింట్లో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా..కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈ సినిమా నుంచి జననీ సాంగ్ రిలీజ్ చేయనున్నట్లుగా చిత్రయూనిట్ రెండ్రోజుల క్రితం ప్రకటించింది. పెద్దన్న అద్భుతంగా కంపోజ్‌ చేసిన జనని పాట..ఆర్‌ఆర్‌ఆర్‌ ఎమోషన్‌కు అద్దం పడుతుందట. నేడు దర్శకుడు రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ లో జనని సాంగ్ రిలీజ్ చేస్తారని ఫాన్స్ ఎంతగానో ఎదురుచూసారు. కానీ వారికి నిరాశే మిగిలింది. ఈపాటను రేపు సోషల్ మీడియాలో అఫీషియల్‏గా విడుదల చేయనున్నారు.