రాజమౌళి మహేష్ బాబుతో అలాంటి స్టోరీ చేయబోతున్నారా ?

Rajamouli with Mahesh Babu New Movie Story

0
103

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ కు జోడీగా అందాల భామ కీర్తిసురేష్ నటిస్తుంది. ఈ సినిమా బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేఫథ్యంలో ఉంటుంది. ఇప్పటికే దుబాయ్ లో కొంత మేర షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది .కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుంది.

ఇక తర్వాత మహేష్ తో రాజమౌళి సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక క్లారిటీ కూడా వచ్చేయడంతో ఇటు అభిమానులు ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ వస్తుందా అని చూస్తున్నారు. ఇప్పటి వరకూ రాజమౌళి తీసిన సినిమాలు అన్నీ సూపర్ హిట్. మరి ఇప్పుడు మహేష్ తో రాజమౌళి ఎలాంటి సినిమా చేయబోతున్నారా అని ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

రాజమౌళి సామాజిక అంశాల పై కమర్షియల్ ఫిల్మ్ రూపొందించే అవకాశం ఎక్కువగా ఉందని ఇప్పుడు టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. ఇక జేమ్స్ బాండ్ తరహా పాత్ర అని ఫస్ట్ వార్తలు వచ్చాయి కానీ ఇది వాస్తవం కాదు అని అంటున్నారు. ఇక ఆర్ ఆర్ ఆర్ తర్వాత జక్కన్ ఈ సినిమాపై ఫోకస్ చేయనున్నారు.