‘బాహుబలి-3’పై రాజమౌళి కీలక ప్రకటన..త్వరలోనే ఆసక్తికర వార్త వస్తుందన్న జక్కన్న

0
102

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్.. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కేసులు పెరగడంతో సినిమాను వాయిదా వేశారు మేకర్స్. దీంతో మెగా నందమూరి అభిమానులు నిరాశకు గురయ్యారు. అదే సమయంలో మార్చి 25న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు మేకర్స్.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జక్కన..’ఇప్పటికే ‘బాహుబలి’, ‘బాహుబలి-2′ చూపించారు. మీ నుంచి ‘బాహుబలి-3’ రానుందని భావించవచ్చా?’ అని రాజమౌళిని అడగ్గా.. “తప్పకుండా భావించొచ్చు. ‘బాహుబలి’ చుట్టూ జరిగే ఎన్నో సంఘటనలు ఈసారి మీకు చూపించనున్నాం. దీనికి సంబంధించిన వర్క్‌ చేస్తున్నాం. మా నిర్మాత శోభు యార్లగడ్డ కూడా సుముఖంగా ఉన్నారు. దీన్ని చూపించడానికి కాస్త సమయం పట్టొచ్చు. కానీ ‘బాహుబలి’ రాజ్యం నుంచి ఆసక్తికరమైన వార్త రానుంది” అని రాజమౌళి వివరించారు.

అలాగే “ముందుగానే చెప్పినట్లు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత నేను చేయబోయే ప్రాజెక్ట్‌ మహేశ్‌బాబుతోనే ఉంటుంది. దానికి సంబంధించి వర్క్‌ జరుగుతోంది. కాకపోతే ప్రస్తుతం నా దృష్టి అంతా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పైనే ఉంది. ఈ సినిమా విడుదలయ్యాక.. కాస్త ప్రశాంతంగా మహేశ్‌ సినిమాపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతా” అని రాజమౌళి తెలిపారు.