రజినీకాంత్ కి ఏమయ్యింది ఆయన క్లారిటీ ఇచ్చారు

రజినీకాంత్ కి ఏమయ్యింది ఆయన క్లారిటీ ఇచ్చారు

0
89

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ గాయాల పాలయ్యారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.. ఇటీవల రజనీ పై అనేక వార్తలు వస్తున్న వేళ రాజకీయంగా ఫేమ్ వస్తున్న వేళ సినిమాల్లో బిజీగా ఉన్న రజినీ రాకీయాల్లో కూడా ఎంటర్ అయ్యారు.. దీంతో తమిళనాట రజినీ జపం చేస్తున్నారు అందరూ, అయితే తాజాగా
డిస్కవరీ ఛానెల్లో మేన్ వర్సెస్ వైల్డ్ షూటింగ్లో సూపర్స్టార్ రజినీకాంత్ పాల్గొన్న సంగతి తెలిసిందే.

పులులు సంచరించే బందీపూర్ ఆటవీ ప్రాంతంలో షూటింగ్ చేశారు. ఆ సమయంలో ఆయన జారిపడి భుజాలకు స్వల్ప గాయాలైనట్లు జాతీయ మీడియా పేర్కొంది. అయితే అలాంటిదేమీ లేదని రజినీకాంత్ తెలిపారు. దీనిపై నిన్నటి నుంచి అనేక వార్తలు వినిపించాయి, మరోపక్క జంతు ప్రేమికులు ఇది చేయడం తగదు అని విమర్శలు చేస్తున్న వేళ రజనీకి ప్రమాదం అని వార్తలు వచ్చాయి.

షూటింగ్ పూర్తి చేసుకుని చెన్నై చేరుకున్న ఆయన విలేకరులతో మాట్లాడారు. కిందపడినప్పుడు చిన్న చిన్న ముల్లు కారణంగా శరీరంపై కొన్ని గీతలు ఏర్పడ్డాయే తప్ప ఎలాంటి గాయాలు కాలేదని ఆయన తెలిపారు. దీంతో రజనీ అభిమానులు మా తలైవా బాగానే ఉన్నారు అని సంతోషంగా ఉన్నారు.