కమెడియన్ కు రజినీకాంత్ సాయం- వీడియో వైరల్

కమెడియన్ కు రజినీకాంత్ సాయం- వీడియో వైరల్

0
87

చాలా మంది హీరోలు గుప్తదానాలు చేస్తూ ఉంటారు, అంతేకాదు ఎవరైనా సాయం కోసం వస్తే కాదు లేదు అనే మాట వారి నుంచి రాదు, బాలీవుడ్ లో సల్మాన్ అక్షయ్ ఈ వరుసలో ముందు ఉంటే.. సౌత్ ఇండియాలో రజినీకాంత్ చిరంజీవి అలా సేవ చేయడంలో ముందు ఉంటారు, పైగా వారు చేసిన సేవ బయట వారికి అసలు చెప్పరు, అంతేకాదు సాయం పొందిన వారిని కూడా ఎవరికి చెప్పద్దు అంటారు, అందుకే అంత పెద్ద స్టార్లు అయ్యారు.

ఇక తాజాగా రజినీకాంత్ ఓ కమెడియన్ కు భారీ సాయంచేశారు, ఇది కోలీవుడ్ లో ఇప్పుడు వైరల్ అవుతోంది…తమిళ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన కమెడియన్ తవసి కొంతకాలంగా క్యాన్సర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు.

క్యాన్సర్ నాలుగో స్టేజ్లో ఉంది. ‍బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేనందగా మారిపోయారు. దీంతో ఆయన చికిత్సకు ఆర్థిక సాయం చేయాలంటూ తవసి కుమారుడు అరుముగన్ కోలీవుడ్ పెద్దలను ఆర్జించాడు.దీనికి సంబంధించి వీడియో తమిళనాట వైరల్ అయింది.. ఈ విషయం తెలుసుకున్న తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ వ్యక్తిగతంగా నటుడి కుటుంబంతో మాట్లాడారు.. తను సాయం చేస్తాను అని తెలిపారు ఆయన. ఇప్పటికే ఆస్పత్రి డాక్టర్లతో మాట్లాడి ఎంత ఖర్చు అయినా వైద్యం చేయాలి అని తెలిపారట. అది సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే అంటున్నారు ఆయన అభిమానులు.