ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం “దర్భార్”. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్‌గా నటించనున్నారు. రజనీకాంత్, మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రం కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రేపు నుంచి ‘దర్బార్’ షూటింగ్ ప్రారంభం కానుంది. ముంబై బ్యాక్‌డ్రాప్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.
ఇప్పటికే ఈ సినిమా కోసం ముంబయిలో భారీ సెట్ ఏర్పాటు చేశారు. 30 రోజుల పాటు అక్కడ తొలి షెడ్యూల్‌ను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రజనీ, మురుగదాస్ ముచ్చట్లు చెప్పుకొంటున్నప్పుడు తీసిన ఫొటో అది. ఈ ఫొటోలో తలైవా చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. దాంతో అభిమానులు ఆయన స్టైల్‌కి ఫిదా అయిపోతున్నారు.
బిగ్ బాస్ మూడో సీజన్‌కు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తెలుగు బుల్లితెర మీద ఎన్నో సంచలనాలు క్రియేట్ చేస్తుందని అందరూ అనుకున్న బిగ్ బాస్ మూడో సీజన్ షో డిజాస్టర్ దిశగా వెళ్తుందని రేటింగ్‌ను బట్టి చెప్తున్నాయి. కార్తీకదీపం సీరియల్ టాప్ రేటింగ్‌తో దూసుకుపోతుంటే బిగ్‌బాస్ -3 చతికిలపడుతోంది.