ఆ పుకార్లు ఎవరు పుట్టిస్తున్నారో తెలుసుకుంటా: హీరో రాజశేఖర్

ఆ పుకార్లు ఎవరు పుట్టిస్తున్నారో తెలుసుకుంటా: హీరో రాజశేఖర్

0
99

టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన తాజా చిత్రం కల్కి. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. దీనిపై రాజశేఖర్ మాట్లాడుతూ అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కల్కి సినిమా చూసి తన కుమార్తెలు కూడా ఇంప్రెస్ అయ్యారని తెలిపారు. తన పిల్లల స్నేహితులు ఈ సినిమా చూసి మీ నాన్న యంగ్ హీరోలకు దీటుగా యాక్షన్ సీన్స్ చేశాడని మెచ్చుకున్నట్టు చెప్పారు.

అయితే, ఇటీవల కొంతకాలంగా తాను విలన్ గా నటించబోతున్నట్టు వస్తున్న ఊహాగానాలపై రాజశేఖర్ స్పందించారు. బాలకృష్ణ, చిరంజీవిల చిత్రాల్లో నటిస్తున్నట్టు వస్తున్న వార్తలు ఎవరు పుట్టిస్తున్నారో అర్థంకావడంలేదని, దీని వెనుక ఎవరున్నారో తెలుసుకునేందుకు విచారణ ప్రారంభిస్తా అంటూ కల్కి చిత్రంలోని పోలీసాఫీసర్ స్టయిల్లో చెప్పారు.

విలన్ గా చేయడం పట్ల తనకేమీ అభ్యంతరాలు లేవని, కాకపోతే ధృవ చిత్రంలో అరవింద్ స్వామికి లభించినటువంటి క్యారక్టర్ ను కోరుకుంటానని వెల్లడించారు.అరవింద సమేత, శ్రీమంతుడు చిత్రాల్లో జగపతిబాబు పాత్రలు బాగా నచ్చాయని, అలాంటి రోల్స్ వస్తే తప్పకుండా చేస్తానని రాజశేఖర్ వివరించారు. సాధారణ ప్రతినాయకపాత్రలు మాత్రం చేయనుగాక చేయననని స్పష్టం చేశారు.