రాజశేఖర్ ఆరోగ్యం పై కీల‌క విష‌యం చెప్పిన జీవిత‌

రాజశేఖర్ ఆరోగ్యం పై కీల‌క విష‌యం చెప్పిన జీవిత‌

0
118

కొద్ది రోజుల క్రితం సినీ నటుడు రాజశేఖర్ ఆయ‌న కుటుంబంలో న‌లుగురికి క‌రోనా సోకింది అని తెలిపారు, అంతేకాదు కొద్ది రోజుల‌కి ఆయ‌న పిల్ల‌లు ఇద్ద‌రికి కరోనా త‌గ్గిపోయింది, వారికి నెగిటీవ్ వ‌చ్చింది, త‌ర్వాత భార్య జీవిత‌కు కూడా క‌రోనా త‌గ్గింది ఆమెకి నెగిటీవ్ వ‌చ్చింది.

అయితే ఇప్పుడు రాజ‌శేఖ‌ర్ మాత్రం ఇంకా క‌రోనాతో పోరాడుతున్నారు, ఇటీవ‌ల ఆయ‌న గురించి ప్రార్ధ‌న‌లు చేయండి అని కుమార్తె కూడా ట్వీట్ చేశారు, అయితే వైద్యులు ఆయ‌న ఆరోగ్యం గురించి హెల్త్ బులిటెన్ విడుద‌ల చేశారు.

హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో ఐసీయూలో ఆయన చికిత్స పొందుతున్నారు, తాజాగా ఆయ‌న ఆరోగ్యం గురించి అనేక వార్త‌లు వినిపిస్తున్నాయి, ఈ స‌మ‌యంలో భార్య జీవిత మాట్లాడారు. ఆయ‌న కోలుకుంటున్నారు, ఆయ‌న‌ని వైద్యులు చాలా బాగా చూసుకుంటున్నారు అని తెలిపారు.

ఎలాంటి డేంజ‌ర్ లేదు అని ఆందోళ‌న వ‌ద్దు అని తెలిపారు జీవిత‌…రాజశేఖర్ త్వరలోనే ఐసీయూ నుంచి కూడా బయటకు వస్తారని చెప్పారు. రాజశేఖర్ వెంటిలేటర్ మీద లేర‌ని తెలిపారు, త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని చెప్పారు అభిమానుల‌కి.