టాలీవుడ్ లో తన సంగీతం తో ప్రేక్షకులను అలరించిన కోటి అయన వారసుడిగా రాజీవ్ సాలూరి ని హీరో గా రంగప్రవేశం చేయించారు.. నోట్ బుక్ , ప్రేమంటే సులువు కాదురా, ఆకాశమే హద్దు, ఓరి దేవుడోయ్, చిన్ని చిన్ని ఆశ వంటి సినిమాలతో రాజీవ్ సాలూరి హీరోగా అందరికి సుపరిచయమవగా ఆ సినిమాలతో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. తన నటన తో ఇప్పటికే కొంత అభిమానాన్ని అందుకున్న రాజీవ్ నటించబోతున్న కొత్త చిత్రం ”అన్ నోన్’ మార్చి 5 నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లబోతుంది. ఈ విషయాన్నీ దర్శక నిర్మాతలు వెల్లడించగా, క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి ఆర్కే నల్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. నారాయణరావు అట్లూరి వైష్ణవి ఫిలిమ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కోటి మరో తనయుడు రోషన్ సాలూరి సంగీతం అందిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత నారాయణరావు అట్లూరి మాట్లాడుతూ మా బ్యానర్ నుంచి వస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం.. దర్శకుడు ఆర్కే నల్లూరి చెప్పిన కథ చాలా బాగుంది.. పూర్తిగా కథను నమ్మి చేస్తున్న సినిమా ఇది.. రాజీవ్ గత సినిమాల్లో చాలా బాగా చేశాడు.. ఈ కథ కు అయన చాలా బాగా సూట్ అవుతున్నాడు.. ఈ మార్చి 5 నుంచి షూటింగ్ కి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాం.. త్వరలోనే సినిమాకు సంబందించిన పూర్తి వివరాలను వెల్లడిస్తాం అని అన్నారు.
నటీనటులు:
రాజీవ్ సాలూరి
సాంతికేతిక వర్గం:
బ్యానర్ : వైష్ణవి ఫిలిమ్స్
సంగీతం : రోషన్ సాలూరి
నిర్మాత : నారాయణరావు అట్లూరి
దర్శకత్వం : ఆర్కే నల్లూరి