ర‌జ‌నీకాంత్ సినిమాలో మీనా హీరోయిన్ కాదట‌

ర‌జ‌నీకాంత్ సినిమాలో మీనా హీరోయిన్ కాదట‌

0
79

థిల్లానా థిల్లానా ఈ సాంగ్ అంద‌రికి ఇష్ట‌మే , అవును ర‌జ‌నీకాంత్ మీనా అంటే వెంట‌నే మ‌న‌కు ఈ పాట గుర్తు వ‌స్తుంది. ముత్తు సినిమాలో అంద‌రికి న‌చ్చే పాట ఇది వీరా, యజమాన్, ముత్తు ఈ సినిమాల్లో మీనా ర‌జ‌నీస‌ర‌స‌న న‌టించింది. ఇక మీనా ఇటీవ‌ల సినిమాల‌కు దూరంగా ఉన్నారు. తాజాగా మ‌ళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చారు.

ఆమె మ‌రోసారి ర‌జ‌నీకాంత్ తో సినిమా చేయ‌నున్నార‌ట . శివ దర్శకత్వంలో రజనీకాంత్‌ ఓ ఫ్యామిలీ డ్రామా చిత్రం చేయనున్న విషయం తెలిసిందే. సన్‌ పిక్చర్స్‌ ఈ సినిమా నిర్మించనుంది. ఇందులో మీనా కీలక పాత్రలో కనిపిస్తారని తెలిసింది.

అయితే మీనా హీరోయిన్ పాత్ర వేస్తారు అని అంద‌రూ అనుకుంటున్నారు… కాని అస‌లు విష‌యం అది కాదు అని తెలుస్తోంది.రజనీకాంత్‌ సరసన ఖుష్భూ, ఆయన కుమార్తెగా కీర్తీ సురేశ్‌ నటిస్తారన్నది మరో
వార్త గా వినిపిస్తోంది…. మీనా ఇందులో ఓ విల‌న్ పాత్ర పోషిస్తున్నార‌ట‌న లేడి విల‌న్ పాత్ర‌కు ఆమెని సెల‌క్ట్ చేశారు అని తెలుస్తోంది… ఈనెల 20 నుంచి చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది.