Rajini: కుమార్తె అడిగితే.. తండ్రి కాదంటాడా?

-

Rajini: నాన్నా నాకోసం ఈ పని చేయవా అని అడిగితే.. ఏ తండ్రైనా చెయ్యను అని అంటాడా? ఈ తండ్రీకూతుర్ల బంధానికి సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ అతీతం కాదు. ఆయన కుమార్తె ఐశ్వర్య దర్శకురాలిగా ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ప్రముఖ నటుడు అధర్వ మురళి ఈ సినిమాలో హీరోగా నటించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్‌ మెుత్తం సిద్ధం చేసుకోగా.. తన తండ్రి కోసం ఓ అతిథి పాత్రను ఐశ్వర్య పాత్రను రాసుకున్నారట. గెస్ట్‌ రోల్‌లో నటించాలని తండ్రిని ఐశ్వర్య కోరటంతో.. రజినీ ఓకే చెప్పారట. కాగా దాదాపు దశాబ్దం కాలం తరువాత తలైవా అతిథి పాత్రలో అలరించనున్నారు. 2011లో బాలీవుడ్‌ బాదుషా షారుఖ్‌ ఖాన్‌ చిత్రం రా వన్‌ చిత్రంలో చివరిగా రజిని (Rajini)అతిథి పాత్రలో కనిపించారు. ఆ సినిమాలో చిట్టి రోబోగా కనిపించి కనివిందు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు మరొకసారి అతిథి పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం రజినీ జైలర్‌ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే విడుదలైన జైలర్‌ సినిమాలో రజని ఫస్ట్‌ లుక్‌ అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...