దివంగత నటి మంజుల, సీనియర్ నటుడు విజయకుమార్ దంపతుల పెద్ద కుమార్తె వనిత విజయకుమార్ తెలుగు తమిళ ప్రేక్షకులకి బాగా పరిచయం ఉన్న నటి… ముఖ్యంగా దేవి సినిమాతో ఆమె మంచి ఫేమ్ సంపాదించుకుంది… తర్వాత తెలుగు సినిమాల్లో ఆమె కనిపించలేదు.. ఇక తాజాగా ఆమె మూడో పెళ్లి వ్యవహారంతో ఆమె పేరు మార్మోగిపోయింది..
ఈ కరోనా లాక్డౌన్ సమయంలో పీటర్ అనే ఫిలిం మేకర్‌ను ఆమె మూడో పెళ్లి చేసుకుంది, అయితే అతని మొదటి భార్యతో వివాదాల కారణంగా వారు మళ్లీ వివాహం అయిన కొన్ని నెలలకే విడిపోయారు, అయితే ఆమె బిగ్ బాస్ లో పాల్గొనడంతో మరింత ఫేమస్ అయ్యారు అనే చెప్పాలి.
అయితే తాజాగా ఆమె వరుస పెళ్లిళ్లు చేసుకోవడం.. వెంటనే మళ్లీ విడిపోవడం ఎందుకు జరుగుతోందో వివరించారు. నా వైవాహకి జీవితం ఇలా అవ్వడానికి కారణం నా తల్లిదండ్రులు అని తెలిపింది ఆమె, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చిరంజీవి రజనీకాంత్ తన పిల్లల విషయంలో వారి పెళ్లి విషయంలో తమ కూతుళ్ల సంతోషాన్ని దృష్టిలో పెట్టుకుని మంచి వాళ్లను చూసి మళ్లీ పెళ్లి చేశారని.. కాని నా పేరెంట్స్ అలా చేయలేదు అని విమర్శలు చేసింది నటి వనిత.