రజనీకాంత్ ఎమోషనల్..ట్విట్టర్ లో ట్వీట్

0
117

దేశవ్యాప్తంగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న నటుడు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘అన్నాత్తే’. ఈ మూవీ నవంబరు 4న రిలీజ్‌ కానుండగా..శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీ పరిచయ పాటను రిలీజ్‌ చేశారు. రజనీ నటించిన ఈ పాటను ఎస్పీబీ పాడారు. ఈ సందర్భంగా ఆయన దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్‌ మీడియాలో ఎమోషనల్ పోస్ట్‌ పెట్టాడు.

‘‘నలభై అయిదేళ్లు నా గాత్రంలా జీవించారు ఎస్పీబీ గారు. నా ‘అన్నాత్తే’ సినిమా కోసం ఆయన పాడిన పాటలో నటిస్తున్నప్పుడు నాకు ఆయన పాడే చివరి పాట ఇదే అవుతుందని కలలో కూడా అనుకోలేదు. నేనెంతగానో అభిమానించే ఎస్పీబీ తన మధురమైన స్వరం ద్వారా ఎప్పటికీ జీవించే ఉంటారు’’ అని రజనీకాంత్‌ తమిళంలో ట్వీట్‌ చేశారు.

https://twitter.com/rajinikanth?