ఇది కదా తలైవా రేంజ్.. బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోన్న ‘జైలర్’

-

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. కేవలం తమిళంలోనే కాకుండా విడులైన అన్ని భాషల్లోనూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూలు చేసి రజినీకాంత్ సత్తా ఏంటో మరోసారి బాక్సాఫీస్‌కు చూపించారు అభిమానులు. తెలుగు అయితే ఏకంగా మెగాస్టార్ భోళా శంకర్ సినిమా తీసేసి మరీ జైలర్‌ను రీప్లేస్ చేస్తున్నారు. దాదాపు పుష్కర కాలం తర్వాత రజనీ ఈ హిట్టు కొట్టాడు.

- Advertisement -

రోబో తర్వాత ఆ స్థాయి హిట్టు పడలేదే అని నిరాశలో ఉన్న తలైవా ఫ్యాన్స్‌కు చొక్కాలు చింపుకునే రేంజ్‌ బొమ్మ పడింది. రజనీకి సరైన కథ పడితే అవుట్‌ పుట్‌ ఏ రేంజ్‌లో ఉంటుందోనని జైలర్‌తో స్పష్టమైంది. ముఖ్యంగా రజనీ సినిమాలకు తెలుగునాట హౌజ్‌ ఫుల్ బోర్డ్‌లు చూసి ఎన్నో ఏళ్లయింది. 2.O, కబాలి, పేట వంటి సినిమాలు బాగానే ఆడినా.. కమర్షియల్‌గా పెద్దగా సక్సెస్‌ కాలేకపోయాయి. దాంతో రజనీ క్రేజ్‌ అంతకంతకూ పడిపోతూ వచ్చింది. అయితే ఇన్నాళ్లు తగ్గుతూ వచ్చిన మార్కెట్‌ను జైలర్‌తో మళ్లీ పుంజుకునేలా చేసుకున్నాడు తలైవా.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...