రజినీ కాంత్ ఆరోగ్యంపై స్పందించిన భార్య లత..ఏం చెప్పారంటే?

Rajinikanth's wife Lata responds to health..what do you say?

0
103

సూపర్ స్టార్ రజినీకాంత్ ఆకస్మాత్తుగా నిన్న ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా తలైవా అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఇక రజినీ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలో తాజాగా రజినీ ఆరోగ్యంపై ఆయన భార్య లత స్పందించారు. నెట్టింట్లో రజినీ కాంత్ ఆరోగ్యం గురించి వస్తున్న వదంతులను నమ్మవద్దని తెలిపారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ క్షేమంగా ఉన్నారని, హెల్త్ చెకప్‌లో భాగంగానే ఆయన ఆస్పత్రిలో చేరారని లతా రజనీకాంత్ తెలిపారు. అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవడం కోసం ఒక రోజు ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుందని చెప్పారు ఆయన సన్నిహితులు చెప్పారు.

ఇటీవలే ఆయన అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నాడు. ఢిల్లీలో ఉప రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన అవార్డును స్వీకరించారు. ఢిల్లీ నుంచి వచ్చిన రజినీ.. బుధవారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి అన్నాత్తే సినిమాను చూశారు.