Rajkummar Rao | పారితోషికం పెంపుపై రాజ్‌కుమార్ క్లారిటీ..

-

ఒక్క సినిమా హిట్ అయిందంటే చాలు పారితోషికం పెంచేస్తారు హీరోలు. అందరూ అని కాదు.. చాలా మంది ఇదే పంథాలో వెళ్తుంటారు. అది కూడా సినిమా ఎంత హిట్ అయిందనే దాన్ని బట్టి వారి పారితోషికం పెరుగుదల ఉంటుంది. అటువంటిది బాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌కుమార్(Rajkummar Rao) ఇటీవల నటించిన సినిమా ‘స్త్రీ-2(Stree 2)’ భారీ విజయం సాధించింది. రూ.50 కోట్లు పెట్టి సినిమా తీస్తే రూ.700 కోట్లు రాబట్టింది. ఇంతటి విజయం తర్వాత రాజ్‌కుమార్ కూడా తన పారితోషికాన్ని రూ.5 మేరా పెంచేశాడట. ప్రస్తుతంం బీటౌన్‌లో ఇదే హాట్ టాపిక్. ఇప్పుడు ఆ రెమ్యూనరేషన్‌ను రూ.11 కోట్లకు పెంచాడని వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

తాజాగా ఈ వార్తలపై రాజ్‌కుమార్(Rajkummar Rao) క్లారిటీ ఇచ్చాడు. తానేమీ అంత తెలివితక్కువ వాడిని కాదని అన్నాడు. ‘‘ఒక్కసారిగా రెమ్యూనరేషన్ పెంచేసి.. ఉన్న నిర్మాతలను కోల్పోయే అంతటి తెలివితక్కువ వాడిని కాదు. బ్లాక్‌బస్టర్ సినిమా చేసినంత మాత్రాన నేను మారను. డబ్బు కన్నా నాకు నా ప్యాషనే ముఖ్యం. ఛాలెంజ్, సర్‌ప్రైజింగ్ రోల్స్ చేస్తూ మిమ్మల్ని అలరిస్తూనే ఉంటా’’ అని చెప్పాడు. అయితే స్త్రీ సినిమా కోసం రాజ్‌కుమార్ రూ.6 కోట్లు అందుకున్నాడు.

Read Also: పుష్ఫ-2 స్పెషల్ సాంగ్ వచ్చేసింది..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...