రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య – ధనుష్ లవ్ స్టోరీ తెలుసా

రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య - ధనుష్ లవ్ స్టోరీ తెలుసా

0
146

సూపర్ స్టార్ రజినీకాంత్ ని కలవడం అంటే చాలా కష్టం ..ఆయన పెద్ద స్టార్ హీరో కాని ఆయన ఇంటికి అల్లుడు అయ్యారు ధనుష్ , అయితే చాలా మందికి ఆయన లవ్ స్టోరీ తెలియదు.. కోలీవుడ్ లో ధనుష్. తుల్లువదో ఇలమై అనే చిన్న సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు.

 

ఆయన అన్నయ్య సెల్వ రాఘవన్ తెరకెక్కించిన ఓ సినిమాలో నటించాడు ధనుష్…అన్నయ్య దర్శకత్వంలో ధనుష్ నటించిన రెండో సినిమా కాదల్ కొండేన్ సంచలన విజయం సాధించింది. ఈ సినిమా చూసిన రజినీకాంత్ పెద్దమ్మాయి ఐశ్వర్య తనకు ఓ బొకే పంపిందట.

 

సినిమాలో చాలా గొప్పగా నటించారు. కంగ్రాట్స్.. కీప్ ఇన్ టచ్ అని అందులో మెసేజ్ కూడా పెట్టిందని చెప్పాడు ధనుష్. ఇక తర్వాత ఇద్దరూ కలిసి కాఫీ షాపులో మాట్లాడుకున్నారు, ఈ సమయంలో మీడియాలో వార్తలు వచ్చాయి ప్రేమలో ఉన్నాము అని… దీంతో నాకు బాధ అనిపించింది తన వల్ల రజనీకాంత్ గారి కూతురికి చెడ్డపేరు వచ్చింది అని… కానీ మా పెద్దలు ఇది తప్పు కాదు అని ఇద్దరి అభిప్రాయాలు తెలుసుకుని పెళ్లి చేశారు…తొలిసారి కలుసుకున్న ఆరు నెలల్లోనే దంపతులయ్యామని తెలిపారు ధనుష్. నిజంగా అంత పెద్ద స్టార్ హీరో అల్లుడు అయినా ఎంతో కష్టపడి పైకి వచ్చారు ధనుష్, రెండు జాతీయ అవార్డులు గెలుచుకున్నారు.