‘రాజుగారి గది 3` ఫస్ట్ లుక్ విడుదల

'రాజుగారి గది 3` ఫస్ట్ లుక్ విడుదల

0
95

దర్శకుడు, టీవీ ప్రజెంటర్ ఓంకార్ ద‌ర్శక‌త్వంలో వచ్చిన హార‌ర్ కామెడీ అప్పట్లో ‘రాజుగారి గ‌ది’ ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో తెలిసిందే. చిన్న సినిమాగా వచ్చి.. పెద్ద విజయం సాధించిన ఆ సినిమాకు ఓంకార్.. సీక్వెల్‌గా నాగార్జున, సమంత లాంటి స్టార్లతో ‘రాజుగారి గది 2’ తీసాడు. తాజాగా ఈ సినిమాకి కూడా సీక్వెల్ చేశాడు ఓంకార్.

అశ్విన్‌బాబు, అవికాగోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. డబ్బింగ్‌, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. షబీర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా `రాజుగారి గది 3` ఫస్ట్ లుక్‌ని వి.వి.వినాయక్ విడుదల చేశారు.ఆ పోస్టర్‌ లుక్ భయంకరంగా ఉంది. అవికా గోర్.. ఆ పోస్టర్‌లో దెయ్యంగా అదరగొట్టింది.