అవును నాకు పెళ్లైంది.. మా ఆయనెవరంటే..!

అవును నాకు పెళ్లైంది.. మా ఆయనెవరంటే..!

0
99

అవును.. నేను పెళ్లి చేసుకున్నానంటూ స్పందించింది బాలీవుడ్ ఐటెం బాంబ్ రాఖీ సావంత్. ఇటీవల ఆమె వివాహమైనట్లు కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రైవేట్‌గా ఆమె పెళ్లి చేసుకున్నట్లు వార్తలు రాగా.. వాటిపై స్పందిస్తూ.. అదొక ఫొటోషూట్‌లో భాగమేనని చెప్పుకొచ్చిన రాఖీ.. తాజాగా నిజాన్ని బయటపెట్టింది.

”మొదట్లో ఈ విషయాన్ని చెప్పడానికి భయమేసింది. అవును నేను పెళ్లి చేసుకున్నా” అని చెప్పుకొచ్చింది రాఖీ. ఇక భర్త గురించి చెబుతూ.. ”అతడి పేరు రితేష్. ఆయన లండన్‌లో ఉంటారు. నా వీసా పనులు ఇంకా జరుగుతున్నాయి. అవి పూర్తైన వెంటనే నేను అక్కడికి వెళతా. భారత్‌లో నాకు ఆఫర్లు వస్తే ఇక్కడికి వచ్చి చేస్తా. నాకు టీవీ షోలను నిర్మించాలని ఎప్పటినుంచో కోరిక ఉండేది.. నా చిరకాల వాంఛ ఇప్పుడు తీరిపోయింది. ఇంతమంచి భర్తను నాకిచ్చిన జీసస్‌కు నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా” అని రాఖీ పేర్కొంది.

ఇక ఓ షోలో తనను చూసిన రితేష్ తనకు ఫ్యాన్స్ అయ్యాడని.. ఆ తరువాత వాట్సాప్‌లో తామిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని రాఖీ తెలిపింది. ఇదంతా ఏడాదిన్నర క్రితం జరిగిందని.. ఆయన గురించి పూర్తిగా తెలుసుకున్నాక.. ఇతడే నా భర్త కావాలని జీసస్‌ను చాలా వేడుకున్నానని.. ఆ దేవుడు తన ప్రార్థనలను మన్నించాడని రాఖీ చెప్పుకొచ్చింది. ఇకపై కూడా దేవుడు తనపై దయ చూపాలని కోరుకుంటున్నానని ఆమె తెలిపింది.