రామ్ అసుర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

-

నటీనటులు : అభిన‌వ్ స‌ర్ధార్‌, రామ్ కార్తిక్, సుమన్, శుభలేఖ సుధాకర్, చాందిని త‌మిళ్‌రాస‌న్‌, శాని సాల్మాన్‌‌, శెర్రి అగర్వాల్ త‌దిత‌రులు

- Advertisement -

సినిమాటోగ్ర‌ఫి: జె. ప్ర‌భాక‌ర రెడ్డి

సంగీతం: భీమ్స్ సిసిరోలియో

ఫైట్స్‌: శ‌ంక‌ర్‌

నిర్మాత‌లు : అభిన‌వ్ స‌ర్ధార్‌,వెంక‌టేష్ త్రిప‌ర్ణ,

క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: వెంక‌టేష్ త్రిప‌ర్ణ

సెన్సార్: U/A

రిలీజ్ డేట్: నవంబర్ 19, 2021

అభిన‌వ్ స‌ర్ధార్‌, రామ్ కార్తిక్ హీరోలుగా సుమన్, శుభలేఖ సుధాకర్, చాందిని త‌మిళ్‌రాస‌న్‌, శాని ప్రధాన పాత్రలలో వెంక‌టేష్ త్రిప‌ర్ణ క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం అందించిన సినిమా రామ్ ఆసుర్. బెంగాల్ టైగర్ ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా అభిన‌వ్ స‌ర్ధార్‌,వెంక‌టేష్ త్రిప‌ర్ణ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. మరి ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వారిని ఏ రేంజ్ లో అలరించిందో ఈ సమీక్ష ద్వారా తెలుసుకుందాం.

కథ : 

ప్రకృతి సిద్ధంగా తయారయ్యే వజ్రాల లాగా కృత్రిమం గా వజ్రం తయారుచేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు రామ్ (రామ్ కార్తీక్). ఇంతలో తాను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి బ్రేకప్ చెప్పడం తో జీవితం లో డిస్టర్బ్ అవుతాడు. దాంతో తాను కోలుకోవడానికి రామాచారి (శుభలేఖ సుధాకర్) అనే పెద్దాయన ను కలుస్తాడు. ఆయన సూచన మేరకు సూరి (అభినవ్ సర్దార్) అనే ఓ వ్యక్తిని కలవడానికి ఓ గ్రామానికి వెళతాడు. అలా అక్కడికి వెళ్లిన తర్వాత ఆ వ్యక్తికి తనకి ఓ బంధం ఉందని తెలుస్తుంది. అసలు వీరిద్దరికీ ఉన్న సంబంధం ఏమిటి.. రామ్ ఆ డైమండ్ ను తయారు చేశాడా అనేదే ఈ సినిమా కథ.

నటీనటులు : 

ఈ సినిమాలో హీరోలుగా నటించిన అభినవ్ సర్దార్ మరియు రామ్ కార్తిక్ లు చాలా బాగా నటించారు. యాక్షన్ సీన్స్ లో కూడా వీరిద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడి నటించారు. కథ లో ఉన్న కొత్తదనానికి తగ్గట్లు వీరిద్దరూ తమ వైవిధ్యమైన నటన తో ప్రేక్షకులను ఎంతో అలరింప చేశారు.ముఖ్యంగా అభినవ్ సర్దార్ తన నటన తో సినిమా కే హైలైట్ గా నిలిచారని చెప్పొచ్చు. సూరి పాత్ర లో అయన ఎంతో చక్కగా ఒదిగిపోయారు. ఇక ఈ సినిమా లో ముఖ్య పాత్ర శాని సాల్మాన్‌‌ పోషించిన శివ అనే పాత్ర. సినిమా లో వీరిద్దరి తర్వాత ఈయనదే ముఖ్యమైన పాత్ర. ఎప్పటిలాగానే ఈ పాత్ర లో శానీ ఎంతో బాగా నటించాడు. హీరోయిన్స్ గా నటించిన చాందిని త‌మిళ్‌రాస‌న్‌, శెర్రి అగర్వాల్ ల గ్లామర్ సినిమా హిట్ కు ఎంతో దోహద పడింది. ఇద్దరు సినిమాలోని రొమాంటిక్ సీన్స్ లో అదరగొట్టేశారు. ఇక సినిమా లోని మిగితా పాత్ర దారులు తమ పరిధి మేరకు చాలా బాగా నటించారు.

సాంకేతిక నిపుణులు :

ఈ సినిమా కథ ఎంతో ఆసక్తికరంగా రాసుకుని దర్శకుడు మొదటి ప్రయత్నం లోనే సక్సెస్ సాధించాడు. అలా ఆయన రాసుకున్న కథ ను తెరపై ప్రజెంట్ చేయడం లో నూటికి నూరు శాతం విజయ వంతం అయ్యాడు. కృత్రిమం గా డైమండ్ తయారు చేయడమనే కాన్సెప్ట్ ఇప్పటి వరకు ఎక్కడా రాలేదనే చెప్పాలి. అలా వెరైటీ కథ కు తగ్గ చక్కని స్క్రీన్ ప్లే మాటలతో ఈ సినిమా ను ఆద్యంతం ప్రేక్షకులు అలరించేలా ఆయన తెరకెక్కించారు. రెండు భాగాలను కూడా అదే ఎమోషన్ తో తెరకెక్కించి ప్రేక్షకుల మన్ననను పొందారు. రొమాంటిక్ సీన్స్ లలో, యాక్షన్ సీన్స్ లలో అదరగొట్టేశాడు. ఇక ఈ సినిమా కు సంగీతం అందించిన భీమ్స్ మరోసారి మ్యాజిక్ చేశాడు. నేపథ్య సంగీతం బాగుంది. ఛాయాగ్రహణం, ఎడిటింగ్ సినిమా కు తగ్గట్లుగా చేశారు. నిర్మాణ విలువలు సినిమా పరంగా చాలా రిచ్ గా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :

కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్

డైరెక్షన్

అభినవ్ సర్దార్

హీరోయిన్స్ గ్లామర్

యాక్షన్ సీన్స్

మైనస్ పాయింట్స్ :

అక్కడక్కడ స్లో గా సాగే సీన్స్

ఓవరాల్ గా రామ్ అసుర్ సినిమా పక్కా మాస్ మసాలా చిత్రం. పెద్ద హీరోల సినిమా లకు ఎలాంటి అనుభూతి అయితే వస్తుందో ఈ సినిమా కు కూడా అదే అనుభూతి వస్తుంది. మాస్ ఎలిమెంట్స్ మామూలుగా లేవు. రొమాన్స్ కూడా అదిరిపోయింది. ముఖ్యంగా స్టోరీ లైన్ ఎంతో కొత్త గా ఉంది.

తీర్పు : డైమండ్ లాంటి సినిమా “రామ్ అసుర్”

రేటింగ్ : 3.25/5

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...