Ram Charan And Wife Upasana Expecting First Child announces Chiranjeevi: అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన మరోసారి తాతయ్యని అవుతున్నానంటూ సంతోషంగా అభిమానులతో పంచుకున్నారు. రామ్ చరణ్, ఉపాసన కొణిదెల త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు చిరు. “హనుమంతుడి ఆశీస్సులతో ఉపాసన, రామ్ చరణ్ తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారని షేర్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రేమ & కృతజ్ఞతతో సురేఖ & చిరంజీవి కొణిదెల, శోభన & అనిల్ కామినేని” అంటూ పోస్ట్ చేశారు చిరంజీవి.
కాగా, చరణ్, ఉపాసనల(Ram Charan Upasana) వివాహం అయ్యి దశాబ్దం పూర్తయింది. వారిని అప్పటి నుండి గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్పబోతున్నారంటూ అభిమానులు ప్రశ్నిస్తూనే ఉన్నారు. కొంతమంది ఉపాసనకి గర్భసంచికి సంబంధించిన సమస్య ఉందని, అందుకే పిల్లలు పుట్టడం లేదంటూ కూడా ప్రచారం చేశారు. ఇదిలా ఉంటే చాలాసార్లు ఉపాసన ప్రెగ్నెంట్ అంటూ పుకార్లు కూడా షికార్లు చేశాయి. అయితే ఈ వార్తలపై చరణ్ దంపతులు పెద్దగా స్పందించలేదు.ఒక ఇంటర్వ్యూ లో మాత్రం ఉపాసన ఖరాకండిగా ఎప్పుడు పిల్లల్ని కనాలి అనేది మా పర్సనల్ ఛాయిస్. వాళ్ళు, వీళ్ళు ఏవో అనుకుంటారని డెసిషన్స్ తీసుకోలేం కదా అంటూ తేల్చి చెప్పేసింది. ఏదైతేనేం లేటుగా అయినా అభిమానులకు మంచి శుభవార్త.