ప్రస్తుతం యంగ్ హీరో రామ్ చరణ్ వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. మంచి కధ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాడు. ఇటీవలే స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటించిన భారీ చిత్రం ఆచార్య అనుకున్న మేరకు కలెక్షన్స్ సాదించలేకపోయిన హీరోస్ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇక ఈ సినిమా తరువాత ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నాడని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా సమయంలో తమిళ అగ్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేసే సినిమాకు ఒకే చెప్పాడు. ఖైదీ సినిమాతో భారీ హిట్ అందుకున్న లోకేష్ ఆ తర్వాత విజయ్ కి కూడా భారీ హిట్ ఇచ్చాడు.
ప్రస్తుతం విశ్వనటుడు కమల్ హాసన్ తో విక్రమ్ సినిమా కూడా చేస్తున్నారు . ఇక ఈయన దర్శకత్వంలో సినిమా కాబట్టి ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే రామ్ చరణ్ పెండింగ్ లో ఉన్న సినిమాలు అన్ని పూర్తి అయినా తరువాత ఈ సినిమా చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తమిళ దర్శకులతో రామ్ చరణ్ చేసిన సినిమాలు రీకార్డ్స్ క్రీయేట్ చేసాయి.