Ram Charan – Upasana | అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల ప్రివెడ్డింగ్ గ్రాండ్గా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు ఆహ్వానం అందడంతో చెర్రీ, ఉపాసన దంపతులు ఓ ప్రైవేట్ జెట్లో జామ్నగర్ బయలుదేరి వెళ్లారు. ఈ సమయంలో ఉపాసన నిద్రపోతుంటే ఆమె పాదాలకు చెర్రీ మసాజ్ చేస్తూ ఉన్నాడు. దీనిని చరణ్ అసిస్టెంట్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్గా మారింది.
వీడియో చూసిన అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఎంతటి వారైనా సరే భార్యకు సేవలు చేయాల్సిందేనని.. చెర్రీ ఆదర్శ భర్త అని, ఉత్తమ భర్త అవార్డు ఇచ్చేయాలని కామెంట్లు చేస్తున్నారు. తమకు ఇలాంటి భర్త రావాలని లేడి ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. గతంలోనూ RRR ప్రమోషన్స్ కోసం అమెరికా వెళ్ళినప్పుడు ఉపాసన షాపింగ్ బ్యాగులు చెర్రీ(Ram Charan) మోసాడు. అలాగే ఇంట్లో వంట చేసేటప్పుడు కూడా సాయం చేస్తూ ఉంటాడు. దీంతో వీరిని టాలీవుడ్ బెస్ట్ కపుల్ అంటూ ఉంటారు.
#RamCharan #Upasana 😍😍😍 pic.twitter.com/70aObiThEU
— Guru Charan (@GuruRCMSD) March 1, 2024