చిరు సినిమాలో చరణ్ పాత్ర ఏమిటో తెలుసా అదిరిపోయింది

చిరు సినిమాలో చరణ్ పాత్ర ఏమిటో తెలుసా అదిరిపోయింది

0
100

రామ్ చరణ్ ప్రస్తుతం బిజీ బిజీగా ఆర్ ఆర్ ఆర్ చిత్ర షూటింగ్ లో ఉన్నారు.. ఓ పక్క తారక్, అలాగే చెర్రీతో ఓరోజు, ఇలా షూటింగ్ ప్లాన్ చేసుకుని ముందుకు వెళుతున్నారు జక్కన్న, ఇక సినిమా షూటింగ్ 70 శాతం వరకూ పూర్తి అయింది అని తెలుస్తోంది. ఆర్ ఆర్ ఆర్’ తరువాత కొరటాల – చిరంజీవి కాంబినేషన్లోని సినిమా కోసం చరణ్ సెట్స్ పైకి వెళ్లనున్నాడు.

అయితే కొరటాల చిరు సినిమాలో చరణ్ నటిస్తారు అని ఇప్పటి వరకూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే ..ఇది పక్కా అని అంటున్నారు టాలీవుడ్ లో సినిమా పెద్దలు, అయితే ఈ చిత్రంలో చరణ్ చాలా డిఫరెంట్ గా కనిపించనున్నారట. ముందు నుంచి చరణ్ చిరు చిన్నతనం లేదా యువకుడిగా ఉన్నపాత్ర చేస్తారు అని వార్తలు వినిపించాయి.

తాజాగా ఈ పాత్ర రివీల్ అయిందని తెలుస్తోంది.. ఆయన ఈ సినిమాలో నక్సలైట్ గా కనిపించనున్నాడనేది తాజా సమాచారం. అయితే ఈ చిత్రానికి ఆచార్య అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారట. ఇంకా చిత్ర యూనిట్ దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు ఉగాదికి చేస్తారేమో చూడాలి.