రామ్ చరణ్ శంకర్ సినిమా అప్ డేట్ వచ్చింది – పోస్టర్ అదుర్స్

Ram Charan Shankar movie update has come

0
98

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి చేసుకున్నారు. ఇక ఆచార్య కూడా పూర్తి అయింది ఇక ఆయన తదుపరి చిత్రం శంకర్ తో చేయనున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది త్వరలో. శంకర్ చరణ్ కోసం ఓ సాలిడ్ స్టోరీ రెడీ చేసి పెట్టుకున్నారట. సినిమా స్టోరీ వర్క్ పూర్తి అయింది. ఇక లొకేషన్ గురించి కూడా వెతికారు. మొత్తం సినిమాకి సంబంధించిన టీమ్ ని సిద్దం చేశారు ఆయన.

తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. మేము సిద్ధంగా ఉన్నాం వచ్చేస్తున్నాం అంటూ ఓ పోస్టర్ ని విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది ఇప్పటి వరకూ ఎవరూ పరిచయం చేయని విధంగా చిత్రంలో ఉండేవారిని పరిచయం చేశారు.

ఈ పోస్టర్లో సినిమా టీమ్ అంతా బ్లాక్ సూట్లు ధరించి చేతిలో ఫైల్స్ , బ్యాగ్ ల‌తో కనిపిస్తున్నారు. రామ్ చరణ్ , కియారా అద్వానీ దర్శకుడు శంకర్ అలాగే నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ అంజలి, సునీల్, జై రామ్ కీలకపాత్రల్లో కనిపించనున్నారని పోస్టర్ చూస్తే అర్ధం అవుతుంది. ఇక త్వరలో సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.