Ram Charan-Upasana | మెగా ప్రిన్సెస్‌కు గ్రాండ్ వెల్కమ్

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన(Ram Charan-Upasana) దంపతులు జూన్ 20న పండంటి పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. దీంతో మెగా ఫ్యామిలీ సంబురాల్లో మునిగింది. సుమారు పదేళ్ల తర్వాత తండ్రి కావడంతో రామ్ చరణ్ సంతోషంలో ఉన్నారు. ఇక మెగాస్టార్ అయితే ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని సంబరాలు చేస్తున్నారు. ఉపాసన పాప ఇద్దరూ ఆరోగ్యంగా ఉండటంతో త్వరగానే డిశ్చార్జ్ చేశారు. జూన్ 23న ఉపాసనను, పాపను డిశ్చార్జ్ చేశారు. చరణ్, ఉపాసన(Ram Charan-Upasana) తమ పాపతో చిరంజీవి ఇంటికి వెళ్లారు. దీంతో చిరంజీవి ఫ్యామిలీ(Chiranjeevi Family) తమ ఇంటికి వస్తున్న మహాలక్ష్మి కోసం ఇంటిని గ్రాండ్‌గా అలంకరించారు. పాపకు వెల్కమ్ చెప్పారు. ఉపాసన తాజాగా తన సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేసింది. ఈ ఫొటోలో ఉపాసన పాపని ఎత్తుకొని కూర్చోగా, రామ్ చరణ్ తన పెంపుడు కుక్క రైమ్ ని ఎత్తుకొని ఉన్నారు. వెనుక వెల్కమ్ హోమ్ బేబీ అని రాసి ఉంది. చుట్టూ బెలూన్స్, ఫ్లవర్స్‌తో అందంగా డెకరేషన్ చేశారు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.

- Advertisement -
Read Also:
1. దారుణంగా పడిపోయిన ‘ఆదిపురుష్’ కలెక్షన్లు.. ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా..?
2. ఆకట్టుకుంటోన్న కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’ టీజర్

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...