Game Changer Teaser | గేమ్ ఛేంజర్ టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే..

-

Game Changer Teaser | మెగాపవర్ స్టార్ అప్‌కమింగ్ సినిమా గేమ్ ఛేంజర్. శంకర్(Shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత చెర్రీ సోలోగా చేస్తున్న తొలి సినిమా కావడమే ఇందుకు కారణం. రాజమౌళితో సినిమా తర్వాత హిట్ అందుకున్న హీరో ఎవరూ లేరు. ఆ రికార్డ్‌ను దేవర సినిమాతో ఎన్‌టీఆర్ బ్రేక్ చేయగా ఇప్పుడు రామ్ చరణ్ వంతు వచ్చింది. మరి ‘గేమ్ ఛేంజర్’తో ఈ గేమ్‌ను చెర్రీ కూడా ఛేంజ్ చేస్తాడా అనేది కీలకంగా మారింది. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

- Advertisement -

ఈ సినిమాను సంక్రాంతి బరిలో దించాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. విడుదలకు ఇంకా దాదాపు రెండు నెలల సమయం ఉండగా మూవీ టీమ్ ప్రమోషన్స్ కూడా ప్రారంభించేసింది. ప్రమోషన్స్ విషయంలో తగ్గేదే లేదని నిర్మాత దిల్‌రాజు(Dil Raju) ఇప్పటికే ప్రకటించాడు. ఈ ప్రమోషన్స్‌కు సినిమా టీజర్ విడుదలతో శ్రీకారం చుట్టాడు. ఈ రోజే విడుదలైన ‘గేమ్ ఛేంజర్’ టీజర్ రిలీజైన గంటల్లోనే అభిమానులను ఉర్రూతలూగించింది.

Game Changer Teaser | “బేసిక్‌గా రామ్ అంత మంచోడు ఇంకోడు లేడు.. కానీ కోపం వస్తే.. వాడంత చెడ్డోడు కూడా ఇంకొకడు ఉండడు” అన్న డైలాగ్ బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తుండగా టీజర్ మొదలవుతుంది. ఆ తర్వాత ఈ సినిమాలో రామ్ చరణ్(Ram Charan) కనిపించే గెటప్స్‌ను ఇంటర్‌డ్యూస్ చేశారు. దీనిని బట్టి చూస్తే సినిమాలో ఎక్కడా కూడా చరణ్.. స్టైలిష్ లుక్‌కు లోటు లేకుండా మేకర్స్ చూసుకున్నారని అర్థమువతోంది. కాగా ఈ టీజర్‌లో చరణ్ స్టైలిష్‌గా బైక్‌పై ఎంట్రీ ఇచ్చాడు. వైట్ కలర్ పంచెలో నడుస్తూ కనిపించాడు. ఆఫీసర్‌గా కూడా సందడి చేశాడు. ఈ టీజర్‌లో కియారా(Kiara Advani)తో చరణ్ లవ్ ట్రాక్‌ను రివీల్ చేసింది టీమ్.

ఆ తర్వాత సినిమాలోని ఇతర పాత్రలను పరిచయం చేశారు. చివర్లో చరణ్.. అన్ ప్రిడెక్టబుల్ అంటూ ఆసక్తి పెంచారు. మొత్తానికి స్టోరీ లైన్ క్లియర్‌గా రివీల్ చేయకుండా టీజర్‌ను ఇంట్రెస్టింగ్‌గా కట్ చేశారు మేకర్స్. చరణ్ మరోసారి తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకునే విధంగా కనిపిస్తున్నాడు. విభిన్నమైన రోల్స్‌లో మెప్పించాడు. అన్ని పాత్రల్లో కూడా ఒదిగిపోయాడు. యాక్షన్ సీక్వెన్స్‌లో ఇరగదీశాడు. తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. మొత్తానికి టీజర్ అయితే మెగా ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది. మరి చూడాలి సంక్రాంతి గేమ్‌ను ఈ సినిమా ఎంతలా ఛేంజ్ చేస్తుందో.

Read Also: సాయి పల్లవికి జ్యోతిక కితాబు.. ఏమనంటే..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...