కొత్త కారు కొన్న రామ్ చరణ్ – ఖరీదు ఎంతంటే వీడియో ఇదే

Ram Charan's new car is expensive

0
78

సినీ నటుడు రామ్ చరణ్ కి కార్లు అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. ఖరీదైన కార్లు ఆయన ఇంటిలో ఎన్నో ఉన్నాయి. తాజాగా ఆయన కొత్త కారుని కొన్నారు. ఆయన ఇంటికి ఆ కారు డెలివరీ అయింది. ఈ కారును ఆయన తనకు నచ్చినట్టుగా డిజైన్ చేయించుకున్నారు. ఎంతో ఇష్టపడి ఈ కారుని తీసుకున్నారు చెర్రీ. బ్లాక్ కలర్ మెర్సిడెస్ మేబాచ్ జీఎల్ఎస్ 600 కారును రామ్ చరణ్ డ్రైవ్ చేశారు.

ఇక ఈ కారు ఖరీదు సుమారు 2.5 కోట్లు ఉంటుంది అని కార్స్ ఇండస్ట్రీ వారు చెబుతున్నారు. కారును ఆయనకు అందించిన కంపెనీ సిబ్బంది ఈ సందర్భంగా ఫొటోలు దిగారు. ఇటీవలే సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా అత్యంత ఖరీదైన లంబోర్ఘిని ఉరుస్ కారును కొన్న విషయం తెలిసిందే.

ఇక తాజాగా వీరి ఇద్దరి అభిమానులు సంతోషంతో ఈ వీడియోలని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇక తారక్ చరణ్ ఇద్దరూ ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయింది.

https://twitter.com/baraju_SuperHit/status/1437063177716396036