నేడు ‘కొండా’ బయోపిక్ షూటింగ్ ప్రారంభం

Ram Gopal Varma 'Konda' shooting at Hanmakonda

0
74

హనుమకొండ జిల్లా కేంద్రంలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ సందడి చేశారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి జీవిత చరిత్ర ఆధారంగా రాంగోపాల్ వర్మ తీస్తున్న కొండా బయోపిక్ షూటింగ్ కోసం హనుమకొండకు వచ్చారు. ఈ సందర్భంగా వర్మకు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, మాజీ మంత్రి కొండా సురేఖ ఘన స్వాగతం పలికారు. వంచనగరిలో కొండా బయోపిక్​ను ప్రారంభించడానికి వారు బయలుదేరారు. వర్మ రాకతో స్థానికంగా సందడి నెలకొంది. షూటింగ్ ప్రారంభంలో భాగంగా హన్మకొండ రాంనగర్ నుంచి వంచనగిరి వరకు బైక్ ర్యాలీగా కొండా అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చారు.

వివాదాస్పద చిత్రాలకు కేరాఫ్​ అడ్రస్ రామ్​గోపాల్ వర్మ. హారర్​, ఫ్యాక్షనిజం, రౌడీయిజం నేపథ్యంలో ఇప్పటికే పలు చిత్రాలు తెరకెక్కించారు. ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్​గా నిలిచిన మాట అటుంచితే..ఈ కథాంశాలతోనే వర్మ మరింత పాపులర్ అయ్యారు.

విజయవాడ రౌడీయిజం నేపథ్యంలో సాగే ‘రక్త చరిత్ర’ సినిమా తీసిన ఆర్జీవీ ఇప్పుడు ‘తెలంగాణలో జరిగిన రక్తచరిత్ర’పై సినిమా తీస్తున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన ఓ వాట్సాప్​ ఆడియో గతంలో వైరల్​ అయింది. ఈ ప్రకటన సమయంలో కారల్ మార్క్స్​ను గుర్తుచేసుకున్న వర్మ.. ‘విప్లవం ఎప్పటికీ ఆగదు.. కేవలం రూపు మార్చుకుంటుంది’ అని చెప్పారు. కొండా సినిమా షూటింగ్ వరంగల్ పరిసరాల్లో ఉంటుందని తెలిపారు.