రామ్ కండిషన్స్ కు చుక్కలు చూస్తున్న పూరి జగన్నాథ్ !

రామ్ కండిషన్స్ కు చుక్కలు చూస్తున్న పూరి జగన్నాథ్ !

0
103

ఇస్మార్ట్ శంకర్’ భారీ సక్సస్ ను ఎంజాయ్ చేస్తున్న పూరీ జగన్నాథ్ కు ఇప్పుడు స్పెయిన్ విహార యాత్ర పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన రామ్ రాకతో మళ్ళీ టెన్షన్ మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ‘ఇస్మార్ట్ శంకర్’ ప్రారంభించే సమయానికి పూరీతో పాటు రామ్ కు కూడ ఏమాత్రం మార్కెట్ లేకపోవడంతో ఈమూవీని అతి తక్కువ బడ్జెట్ లో తీయాలని నిశ్చయించుకున్నారు.

అంతేకాదు రామ్ ఈసినిమాకు సంబంధించి తనకు రావలసిన పారితోషికంలో కేవలం సగం మాత్రమే తీసుకుని మిగతా పారితోషికం ఈమూవీ విడుదల అయ్యాక తీసుకుంటాను అని అన్నట్లు సమాచారం. అన్నమాట ప్రకారం పూరి రామ్ కు ఇవ్వవలసిన పెండింగ్ పారితోషికం ఇవ్వడానికి రెడీ అయిపోయినా ఇప్పుడు రామ్ చెపుతున్న కండిషన్స్ పూరీకి తలనొప్పిగా మారాయి అని అంటున్నారు.

ఈసినిమాకు సంబంధించి తనకు రావలసిన పెండింగ్ పారితోషికంతో పాటు ఈమూవీకి వచ్చిన లాభాలలో 25 శాతం షేర్ అడుగుతున్నట్లు టాక్. ఈ కండిషన్స్ ముందు అనుకోని పరిస్థితులలో పెండింగ్ పారితోషికంతో పాటు అదనంగా మరికొంత పారితోషికం ఇస్తానని లాభాలలో వాటా అడగవద్దు అంటూ పూరి చెపుతున్న వాదనకు రామ్ అంగీకరించడం లేదు అని టాక్.