మాస్ మహారాజ్ రవితేజ దూకుడు పెంచారు. వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే క్రాక్ తో హిట్ కొట్టిన హీరో ఖిలాడీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఇక తాజాగా రవితేజ నటిస్తున్న మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’
శరత్ మండవ దర్శకుడు కాగా దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా జూలై 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఈ సినిమా నుండి అదిరిపోయె అప్డేట్ ఇచ్చారు.
ఈ మూవీ నుండి “నా పేరు సీసా” అంటూ సాగే ఐటెం సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాటను శ్రేయా ఘోషాల్ పాడటం గమనార్హం. కాగా ఈ సినిమా యధార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనిపించనున్నాడు.
వీడియో చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి.
https://www.youtube.com/watch?v=ZUPYbt7KKME&feature=emb_title