సినిమా అంటే 24 క్రాఫ్ట్ అందరూ కష్టపడితేనే అద్బుతంగా వస్తుంది, అందుకే ఎవరికి ఇచ్చే రెస్పెక్ట్ వారికి, అలాగే సినిమాకి చేసిన పనికి తగు ప్రతిఫలం ఇస్తారు నిర్మాతలు. కాని ఇటీవల సినిమాలో సింగర్స్ కు మంచి పేరు వస్తుంది, అలాగే సినిమాలో పాటలకు సంగీతం ఇచ్చే దర్శకులకి పేరు వస్తోంది.. కాని పాట రాసేవారికి మాత్రం పెద్ద గుర్తింపు రావడం లేదు.
ఇటీవల సినీ గేయ రచయితలకు సరైన గుర్తింపు దక్కడంలేదంటూ ప్రముఖ లిరిక్ రైటర్ రామజోగయ్యశాస్త్రి ఆవేదన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన గతంలో అనేక సందర్బాల్లో ఈ విషయాన్ని తెలిపారు, ఆయన రాసే పాటలు కూడా ఎంతో పాపులర్ అయిన విషయం తెలిసిందే,
తాజాగా అన్ని తెలుగు ఎఫ్ఎం రేడియో స్టేషన్లకు ఓ విజ్ఞప్తి చేశారాయన. ప్రియమైన ఎఫ్ఎం స్టేషన్లకు, ఓ పాటను ప్రసారం చేస్తున్నప్పుడు దయచేసి పాటను రాసిన లిరిక్ రైటర్ పేరును కూడా ప్రస్తావించండి. ఇది మా లిరిక్ రైటర్లందరి తరఫు నుంచి విన్నపం అంటూ ట్వీట్ చేశారు. దీనికి చాలామంది మంచి సజెషన్ సార్ అని రిప్లై లు కామెంట్లు ఇస్తున్నారు, అంతేకాదు ఈ ట్వీట్ ని రీ ట్వీట్ చేయాలని గేయ రచయితలు చంద్రబోస్, భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్, శ్రీమణి, సిరాశ్రీలకు సూచించారు.