Rambha: హీరోయిన్ రంభకు యాక్సిడెంట్..?

-

Rambha: సీనియర్ హీరోయిన్ రంభ కారు ప్రమాదానికి గురైంది. కెనడాలోని టొరంటోలో స్కూల్ నుంచి పిల్లలను తీసుకొస్తుండగా మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రంభతో పాటు ఆమె కూతురు సాషాకు గాయాలయ్యాయి. సాషా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది. తాను ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నానని.. తన కూతురు త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలంటూ రంభ సోషల్ మీడియాలో ప్రమాదానికి సంబంధించిన ఫొటోలను షేర్‌ చేశారు.

- Advertisement -

అయితే.. ప్రస్తుతం రంభ ఫ్యామిలితో కెనడాలో ఉంటున్నారు. ఈ క్రమంలో తన పిల్లలను స్కూల్‌ నుంచి తీసుకొని వస్తుండగా వీరి కారును మరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో తామంతా స్వల్ప గాయాలతో బయటపడినట్లు రంభ(Rambha) తెలిపారు. కానీ.. తన చిన్న కుమార్తె సాషా మాత్రం గాయాల కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని పేర్కొన్నారు. ప్రమాద సమయంలో కారులో రంభ, ఆమె పిల్లలు, ఒక ఆయా కూడా ఉన్నాట్టు తెలుస్తుంది. ప్రమాదం గురించి రంభ పోస్ట్ చేసిన ఫొటోలు చూసి అభిమానులు చిన్నారి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

click the link below:     

https://www.instagram.com/p/CkZdR20sxtk/?utm_source=ig_web_button_share_sheet

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...