బాబాయ్ బర్త్ డే సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన అభిమాన కుటుంబాలకు..రామ్ చరణ్ ఆర్ధికసాయం…ఎంత అంటే…

బాబాయ్ బర్త్ డే సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన అభిమాన కుటుంబాలకు..రామ్ చరణ్ ఆర్ధికసాయం...ఎంత అంటే...

0
143

నిన్న రాత్రి చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కర్లగట్టలో సోమశేఖర్, అరుణాచలం, రాజేంద్రలు పవన్ జన్మదిన సందర్భంగా 25 అడుగుల ఫ్లెక్సీలు కడుతుండగా వారికి విద్యుత్ వైర్లు తగిలి మృతి చెందిన సంగతి తెలిసిందే….. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు… ఈ ఘటనపై సినీ హీరో రామ్ చరణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు…

ముగ్గురు అభిమానులు ప్రాణాలు కోల్పోయారనే వార్త తనను కలచి వేసిందని తెలిపారు… మీ ప్రాణాలకంటే ఏదీ ముఖ్యం కాదని అన్నారు… అభిమానులు ఈ విషయాన్ని గుర్తించుకోవాలని తెలిపారు… చనిపోయిన వారికి ఆత్మకు శాంతికలగాలని అలాగే వారి కుటుంబాలకు ప్రగాడసానుభూతి తెలిపరు… వారిలేని లోటు మనం పూడ్చలేమని రామ్ చరణ్ అన్నారు…

ముగ్గరు కుటుంబాలకు 2.5 లక్షల చొప్పున సాయం చేస్తానని ప్రకటించారు.. పవన్ కూడా స్పందించారు… జనసైనికుల మరణం తీవ్ర విషాదాన్ని నింపిందని పవన్ అన్నారు… మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు పవన్ తెలిపారు… అంతేకాదు వారి కుటుంబానికి అండగా ఉంటామని పవన్ హామీ ఇచ్చారు…