చిరు సినిమాలో చరణ్ ఎన్ని నిమిషాలో తెలుసా

చిరు సినిమాలో చరణ్ ఎన్ని నిమిషాలో తెలుసా

0
85

మెగాస్టార్ చిరంజీవి తాజాగా సైరా చిత్రంతో అభిమానులని అలరించారు, అయితే ఈ సినిమాలో మాత్రం చిరుకి మంచి పేరు వచ్చింది, అయితే మెగాస్టార్ మరో కమర్షియల్ సినిమా చేయడానికి సిద్దం అయిన విషయం తెలిసిందే, ఆయన 152 వ సినిమాని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు, అయితే సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తాయి శివ సినిమాలు ఇక చిరుతో సినిమా అంటే హోప్స్ కూడా బాగానే పెట్టుకున్నారు అభిమానులు.

ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఎంతగానో ఎదురు చూస్తున్నారు…దీనితో అయితే ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచీ కూడా ఒక రూమర్ అలా కొనసాగుతూ వస్తూనే ఉంది. ఆ రూమర్ అసలు నిజమా కాదా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో మెగాస్టార్ తో పాటుగా ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కలిసి నటించబోతున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి.

అయితే ఆర్ ఆర్ ఆర్ చిత్ర షూటింగులో బిజీగా ఉన్న చరణ్ ఈ సినిమాలో నటిస్తారు అంటున్నారు.. అంతేకాదు ఈ సినిమా కోసం 30 రోజులు కాల్షీట్లు ఇచ్చారు అంటున్నారు, అయితే సినిమాలో చరణ్ కు ఇరవై నిమిషాల సీన్స్ ఉంటాయి అని చెబుతున్నారు. అయితే టాలీవుడ్ టాక్స్ ప్రకారం ఇది కరెక్ట్ అని అంటున్నారు, అక్కడ చరణ్ సినిమా చేస్తూనే ఇక్కడ కొరటాల సినిమాలో నటిస్తారు అని అంటున్నారు.