మెగాస్టార్ అభిమానులు చిరంజివి నుంచి నేటి చరణ్ వరుణ్ బన్నీ ఇలా అందరిని ఎంతో అభిమానిస్తారు చిరుపై ఎంత ప్రేమ చూపించేవారో అదే ప్రేమ ఇప్పటికీ వారిపై చూపిస్తారు అలాంటి అభిమానిలో మెగా కుటుంబానికి బాగా దగ్గరా ఉండే వ్యక్తి మెగా ఫ్యామిలీ వీరాభిమాని నూర్ బాయ్.. కాని దురదృష్టవశాత్తు ఆయన ఇటీవల గుండెపోటుతో మరణించారు.
మెగా హీరోలు ఆయన నివాసానికి వెళ్లి నివాళి అర్పించారు, అంతేకాదు కుటుంబానికి ఆసరాగా ఉంటాము అని తెలిపారు.. తాజాగా నూర్ బాయ్ కుటుంబాన్ని హీరో రామ్ చరణ్ పరామర్శించారు. నూర్ బాయ్ మృతి చెందిన సమయంలో షూటింగ్ నిమిత్తం విదేశాల్లో ఉన్న రామ్ చరణ్ హైదరాబాద్ రాగానే ఆ కుటుంబాన్ని కలుస్తానని చెప్పారు. ఆ మాట ప్రకారం నూర్ బాషా కుటుంబాన్ని కలిశారు.
ఆయన గురించి పలు విషయాలు మాట్లాడారు, ఆయన కుటుంబానికి ఏ సమస్య వచ్చినా తాము ఉన్నాము అని తప్పకుండా తెలియచేయాలి అని అన్నారు. వారి కుటుంబానికి ఆర్థిక సాయం కింద రూ.10 లక్షల చెక్కును అందజేశారు. నూర్ బాయ్ కుమారుడికి మంచి ఉద్యోగం ఇప్పిస్తానని, ఇద్దరు కూతుళ్ల వివాహానికి వస్తానని సాయం చేస్తాను అని రామ్ చరణ్ మాట ఇచ్చారు, దీంతో నూర్ బాయ్ కుటుంబం చాలా ఆనందంలో ఉన్నారు చరణ్ చేసిన సాయానికి ఎంతో సంతోషించారు.