పవన్‌కి స్రైపెజ్ ఇవ్వబోతున్న చరణ్ ..!

పవన్‌కి స్రైపెజ్ ఇవ్వబోతున్న చరణ్ ..!

0
91

సెప్టెంబర్ 2 వ తేదీ మెగా పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అన్న విషయం అందరికి తెలిసేందే. పవన్ సినిమాల్లోని మ్యానరిజం యూత్‌ని ఆకర్షించింది దాంతో పవన్‌కు ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఎంతో పాపులారిటీతో ఉన్న పవన్ ఏపీ ఎన్నికల సందర్భంగా జనసేన పార్టీ స్థాపించి, ఎన్నికల్లో పోటి చేశారు.

దాంతో దాదాపుగా ఏడాదిగా సినిమాలకు దూరంగా ఉన్నారు. జనసేన పార్టీని స్థాపించిన అనంతరం పవన్ ప్రజలకు మరింత దగ్గరయ్యాడు. ప్రజల సమస్యలను తీరుస్తూ మీకు నేనున్నా అంటూ ఒక్క అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు పవన్.అయితే గత ఎన్నికల్లో అనుకోని ఓటమిని ఎదురు చూశాడు పవన్. జనసేన పార్టీ తరపున కేవలం ఒకే ఒక సీటు సంపాదించుకుంది. రాజకీయంగా ఓడిపోయిన పవన్‌ను అధికార పార్టి, ఇతర పార్టీలు మాటలతో దూషించిన తన దారిన తాను ముందుకెళ్తున్నాడు. రాజకీయంలో పరాజయం పాలైన పవన్ మళ్లి సినిమాల్లో ఏంట్రీ ఇవ్వబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.

అన్నట్టుగానే పవన్ సైరా సినిమాలో బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఇచ్చాడు. ఇకపోతే సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ 48 వ పుట్టిన రోజు. అదే రోజున వినాయక చవితి కావడంతో మెగా ఫ్యాన్స్ కు రెండు పండగలు ఒకే రోజున వచ్చాయి. దానికి తోడు పవన్ కామన్ డీపీని రాంచరణ్ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. ఆ ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది.