ఆంధ్రులను రెచ్చగొట్టేవిధంగా ఉన్న రామ్ గోపాల్ వర్మ కేసీఆర్ పాట..!!

ఆంధ్రులను రెచ్చగొట్టేవిధంగా ఉన్న రామ్ గోపాల్ వర్మ కేసీఆర్ పాట..!!

0
108

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల “లక్ష్మీస్ ఎన్టీఆర్” అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వర్మ ప్రస్తుతం రెండు బయోపిక్‌లని రూపొందించే పనిలో ఉన్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై “టైగర్ కేసీఆర్” అనే టైటిల్‌తో ఓ బయోపిక్ చేస్తుండగా, “శశికళ” పేరుతో కూడా బయోపిక్ రూపొందిస్తున్నాడు .ముందుగా కేసీఆర్ బయోపిక్ ని రెడీ చేస్తుండగా రెండు రోజులు క్రితమే ఈ బయోపిక్‌కి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్‌మెంట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. సినిమా టైటిల్‌ను ‘టైగర్ కేసీఆర్‌’గా కూడా అనౌన్స్ చేశాడు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ పాటను కూడా రెడీ చేశాడు. “మా భాష మీద నవ్వినవ్. మా ముఖాల మీద ఊసినవ్. మా బాడీల మీద నడిసినవ్ ఆంధ్రోడా. వస్తున్నా. వస్తున్నా. మీ తాటతీయనీకి వస్తున్నా.” అంటూ తాను ప్రకటించిన ‘టైగర్ కేసీఆర్’ లోని ఓ సాంగ్ లిరిక్స్ పడి వినిపించాడు రామ్ గోపాల్ వర్మ. దీనిపై ఆంధ్రుల మనోభావాలు దెబ్బతింటున్నాయి.. ఈ నేపథ్యంలో వారు వర్మ పై ఎలా విరుచుకుపడతారో చూడాలి.. టైటిల్‌కి “అగ్రెసివ్ గాంధీ” అనే క్యాప్షన్ తో పాటు “ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు” అంటూ తెలుగులో ఉప శీర్షిక కూడా పెట్టాడు.