సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు, సింపుల్ గా సినిమాలు అనౌన్స్ చేస్తారు అంతేవేగంగా సినిమా తీస్తారు, అయితే ఈ లాక్ డౌన్ సమయంలో ఆయన సినిమాలు తీస్తూ విడుదల చేస్తూ సరికొత్తగా టాలీవుడ్ లో చర్చకు కారణం అయ్యారు.
పవర్ స్టార్ అనే చిత్రాన్ని కూడా తాజాగా తీశారు వర్మ.. ఇక మరో చిత్రం అల్లు కూడా అనౌన్స్ చేశారు, మర్డర్ చిత్రం కూడా అనౌన్స్ చేశారు. ఇక తాజాగా వర్మ ఆస్తుల గురించి కూడా చర్చ జరుగుతోంది, వర్మ కూడా తన ఆస్తుల గురించి ఎప్పుడూ చెప్పలేదు.
రాంగోపాల్ వర్మ ఆస్తులు 110 కోట్ల నుండీ 120 కోట్ల మధ్యలో ఉంటుందని టాక్ నడుస్తోంది, ఆయనకు నాలుగు ఐదు ఫామ్ హౌస్ లు ఉన్నాయి అని ఖరీదైన కార్లు ఉన్నాయి అంటారు, అలాగే మెర్సిడెస్ బెంజ్ జి ఎల్ క్లాస్ అనే కారు కూడా ఉంది, ఇక హైదరాబాద్ లో కూడా ఆయనకు సొంత ఆఫీస్ సొంత ఇళ్లు ఉంది. మొత్తానికి కొందరు అయితే వర్మకి ఇంత ఆస్తి ఉండదు ఇదంతా ఫేక్ అంటున్నారు, మరికొందరు మాత్రం వర్మకి ఇందులో సగం అయినా ఆస్తి ఉంది అంటున్నారు. ఇందులో ఏది వాస్తవమో మరి.